మనిషికీ మనసుకూ మంచి అవగాహన ఏర్పడినప్పుడు ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందనడానికి గాంధీజీ జీవితంలో ఒక సంఘటన చక్కని ఉదాహరణ. ఒకరోజు ఆయన రైలులో ప్రయాణిస్తుండగా పొరపాటున ఒకకాలి చెప్పు జారిపడిపోయింది. గాంధీజీ వెంటనే రెండోదాన్ని చేతిలోకి తీసుకుని మొదటిది జారిపడిన దిశగా బలంగా విసిరేశారు. పోయినదానిపై లేదా గతించినదానిపైనే మనసూ లగ్నమై ఉంటే- ఉన్నదాని ఉపయోగం ఆయనకు వెంటనే స్ఫురించేది కాదు. వర్తమానంలో ఉండటం అంటే అదీ. వర్తమానంలో జీవించే మనిషికి తక్షణకర్తవ్యం చప్పున బోధపడుతుంది. మనసు తనతోనే ఉందని దాని అర్థం. అలా మనసారా జీవించడాన్నే మనపెద్దలు యోగజీవనం అన్నారు.
No comments:
Post a Comment