మీ ఇంటి గదులెంత విశాలమైనవో దేవుడు అడగడు. నువ్వెంతమందిని విశాల హృదయంతో నీ ఇంటికి ఆహ్వానించావో అడుగుతాడు!
నీది ఎన్ని అంకెల జీతమో దేవుడు అడగడు. నీ సంపాదనలో ఎంత నిజాయతీ ఉందో అడుగుతాడు!
నీ ఉద్యోగానికి ఎంత గొప్ప పేరుందో దేవుడు అడగడు. నీ విధ్యుక్త ధర్మాన్ని నీ శక్తికొద్దీ నిర్వహిస్తున్నావా అని అడుగుతాడు!
నీదెంత పెద్దకారో దేవుడు అడగడు. నడిచి వెళ్లేవాళ్లను ఎందరిని నీ కారులో తమ గమ్యానికి చేర్చావని అడుగుతాడు!
నువ్వెంత గొప్పవాడలో నివసిస్తున్నావని దేవుడు అడగడు. నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వెలా మెలగుతున్నావని అడుగుతాడు!
నీకెంతమంది స్నేహితులున్నారని దేవుడు అడగడు. నువ్వెంతమందికి స్నేహితుడివని అడుగుతాడు!
నీ ఒంటి రంగేమిటని దేవుడు అడగడు. నీలో ఎంత సౌశీల్యత ఉందని అడుగుతాడు!
నువ్వు ఏ ఘనమైన పిండివంటలతో భోజనం చేస్తావని దేవుడు అడగడు. నువ్వెంతమంది అన్నార్తుల ఆకలి తీర్చావని అడుగుతాడు!
నీ అలమరలో నీకెన్ని జతల బట్టలున్నాయని దేవుడు అడగడు. నువ్వెంతమంది నిర్భాగ్యులకు నీ బట్టలిచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు!
నువ్వెంతమందికి న్యాయం చేశావని దేవుడు అడగడు. ఎంతమందికి అన్యాయం కాకుండా చూశావని అడుగుతాడు!
నువ్వెందరికి గుణాలు పంచి ఇచ్చావని దేవుడు అడగడు. ఎందరి కష్టాల్లో పాలు పంచుకున్నావని అడుగుతాడు!
నువ్వెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని దేవుడు అడగడు. చదివిన పుస్తకాల్లో నువ్వెంత సారాన్ని గ్రహించావని అడుగుతాడు!
నువ్వెన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని దేవుడు అడగడు. నువ్వెంత మానవసేవ చేశావని అడుగుతాడు!
నువ్వెలాంటి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నావని దేవుడు అడగడు. ఇంకొకరికి సాయపడటంలో ఎంత ఆనందముందో అనుభవించమంటాడు!
ముక్తిపథం చేరటానికి ఇంత ఆలస్యం చేశావేమని దేవుడు అడగడు. నువ్వురాగానే నీ చెయ్యి పట్టుకుని స్వర్గధామం వైపు తానే తీసుకువెడతాడు.